Saturday, November 23, 2024

మాస్క్ లేకుంటే రైళ్లలో నో ఎంట్రీ

దేశంలో ప్రస్తుతం తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రరైల్వే కొవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోందని జోన్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్య స్పష్టం చేశారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రయాణికులందరూ రైల్వే స్టేషన్లలో, ప్రయాణ సమయాల్లో తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించాలని సూచించారు.

అలాగే ప్రయాణికులు భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలన్నారు. కొవిడ్ లక్షణాలున్న, పాజిటివ్ గా నిర్ధారణ అయిన ప్రయాణికులు నిర్లక్ష్య ధోరణితో రైళ్లలో ప్రయాణించడం వల్ల తోటి ప్రయాణికులు, విదుల్లో ఉన్న రైల్వే సిబ్బందికి ప్రమాదకరంగా మారు తారన్నారు. కనుక పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు, జ్వరం, దగ్గు, తీవ్ర ఒళ్లునొప్పులు, శ్వాసకోస ఇబ్బందులు వంటి లక్షణాలున్న వారు రైళ్లలో ప్రయాణించవద్దని సూచించారు. ఇలాంటి లక్షణాలున్న వారు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. ఎవరైనా ప్రయాణికులకు తీవ్ర జ్వరం ఉంటే గుర్తించడానికి అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో థర్మల్ స్కానింగ్ పరికరాలు ఏర్పాటు చేశామని, స్కానింగ్ లో ఎవరైనా జ్వరంతో ఉన్నట్లు తెలిస్తే వారిని ప్రయాణించడానికి అనుమతించబోమని జీఎం గజానన్ మాల్య స్పష్టం చేశారు. అలాగే అన్ని స్టేషన్లలో, ప్రయాణాలలో ‘మాస్కు లేకుంటే ప్రవేశం లేదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రయా
ణికులంతా రాష్ట్రాలవారీగా విధించిన కొవిడ్ నిబంధనలు తెలుసుకుని, వాటి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. అలాగే రైల్వే సిబ్బంది కొవిడ్ దృష్ట్యా రైళ్లను, స్టేషన్లను పరిశుభ్రంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement