ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ రైలు ఎక్కినా, దిగినా జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెచ్చరించారు.. ఈ మేరకు నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే రైల్వే ట్రాక్‌పై సెల్ఫీలు తీసుకున్నా జైలు శిక్ష తప్పదన్నారు. పట్టాల వెంబడి రీల్స్, షార్ట్ ఫిల్మ్ లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫొటోగ్రఫీలు తీసుకుంటే కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు.
- Advertisement -
రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం, పట్టాలు దాటడం కూడా నేరమేనని తెలిపారు.. ప్రయాణీకులు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, సబ్‌వేలు, రోడ్ ఓవర్ బ్రిడ్జీలను ఉపయోగించాలన్నారు.. నిబంధనలు ఉల్లఘించినట్లయితే భారతీయ రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 147 ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.వెయ్యి వరకు జరిమానా. లేదా రెండు శిక్షల విధిస్తారని వెల్లడించారు.