ఉత్తర్‌ప్రదేశ్ లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అలహాబాద్ నుంచి పీటీ డీడీయూ జంక్షన్‌కు వస్తున్న గూడ్స్ రైలు.. చందౌలీ సమీపంలో ఉదయం 6.40 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. మొత్తం 8 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ మార్గంలో ఇతర సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. సుమారు 12 రైళ్లు నిలిచిపోయాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement