Friday, November 22, 2024

Train Accident – పాడైపోతున్న మృత‌దేహాలు – గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్న బంధువులు…

న్యూఢిల్లి : రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరు కుందని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. మొత్తం 288 మృతదేహాల్లో 205 దేహాలను గుర్తించి మృతుల బంధువులకు అప్పగించినట్టు చెప్పారు. మిగిలిన 83 దేహాలను గుర్తించడం కోసం భువనేశ్వర్‌లో ఎయిమ్స్‌ ఆసుపత్రితో పాటుగా వేర్వేరు ఆసుపత్రుల్లో భద్రపరిచినట్టు తెలిపారు. మొత్తం 288 మృతదేహాల్లో 83 మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయితే మృతదేహాలను ఎక్కువ కాలం ఉంచడం సరికాదని ఢిల్లి లో ఎయిమ్స్‌ ఆసుపత్రిలో అనాటమీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ఏ షరీఫ్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన 12 గంటల తర్వాత ఆసుపత్రికి చేరుకున్న మృతదేహాలు పాడైపోకుండా ఉండటానికి లేపనాల ను వినియోగించినప్పటికీ ప్రయోజనం ఉండదని చెప్పారు. అయితే మృతదేహాలను పాడైపోకుండా ఉండటానికి వాటిని నిల్వ ఉంచడం కోసం పారాదీప్‌ పోర్ట్‌ నుంచి కనీసం ఐదు ఫ్రీజర్లను భువనేశ్వర్‌లో ఎయిమ్స్‌ ఆసుపత్రి తెప్పించింది. అధికారులు చూపించిన ఒక స్లయిడ్‌ షోలో గుర్తించడానికి వీల్లేకుండా దెబ్బతిన్న మృతదేహాలను గుర్తించడానికి బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి వెలికితీసిన దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని, విద్యుదాఘాతం తో వారు మరణిం చినట్టు విశ్వసిస్తున్నట్టు బాలాసోర్‌ ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ కుమార్‌ నాయక్‌ తాను దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రమాదంలో బోగీ లు బోల్తా కొట్టినప్పుడు ఓవర్‌ హెడ్‌లో టెన్షన్‌ కరెంట్‌ లైన్‌ వాటి పై తెగిపడటంతో ప్రయాణికుల్లో అనేకమంది విద్యుదా ఘాతా నికి గురై చనిపోయారని తెలిపారు. రైలు ప్రమాదంపై సిబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసిన కేంద్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తన లక్ష్యంగా చేసుకుంది. తన వైఫల్యాల నుం చి ప్రజల దృష్టిని మళ్ళించడానికి కొత్తగా కుట్ర సిద్ధంతాలను తెర మీదకు తీసుకు వస్తోందని ఆరోపించింది పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే మాట్లాడుతూ ”2016లో ఉత్తరప్రదేశ్‌లో పాట్నా- ఇండోర్‌ ఎక్స్‌ప్రెస్‌, 2017లో ఆంధ్రప్రదేశ్‌లో హీరాఖుండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు ఏజె న్సీకి(ఎన్‌ఐఏ) అప్పగించింది. 2 ప్రమాదాల్లో మొత్తం 200 మంది ప్రయాణికులు మృతి చెందారు” అని తెలిపారు. దర్యా ప్తు చేపట్టి ఏడేళ్లు గడిచిపోయినప్పటికీ రెండు కేసుల్లో నూ ఒక్క చార్జ్‌షీట్‌ కూడా ఎన్‌ఐఏ దాఖలు చేయలేదని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement