Thursday, November 21, 2024

Follow up : వారాంతంలో నష్టాల బాట.. సెన్సెక్స్‌ 87, నిఫ్టీ 36 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు వారాంతంలో నష్టాల్లో ముగిశాయి. ఇవ్వాల (శుక్రవారం) ఒడుదొడుకల మధ్యే ట్రేడింగ్‌ కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత కనిష్టస్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు పుంజుకున్నాయి. కానీ పూర్తిస్థాయి లాభాల్లోకి రాలేకపోయాయి. జీవితకాల గరిష్ట స్థాయిల్లో స్థిరీకరణ కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్నిరంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది పాజిటివ్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు లేకపోవడం కూడా మన మార్కెట్లు బలహీనంగా ఉండటానికి కారణమయ్యాయి. వారాంతం ముగింపు సమయానికి సెన్సెక్స్‌ 87 పాయింట్ల నష్టంతో 61,663 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 36 పాయింట్ల నష్టంతో 18,307 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌-30 సూచీలో 10 షేర్లు లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంకులు, రియల్టిd షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎస్‌బీఐ, కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌, ఇన్ఫీ, యాక్సిస్‌బ్యాంక్‌, టెక్‌ మహీంద్ర లాభపడ్డాయి. మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, విప్రో, అల్ట్రాటెక్‌ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.65 వద్ద నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement