బోరబండ, (ప్రభన్యూస్): బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాని మనస్థాపంతో ఓ బాలుడు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన నగేష్ (16) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి చిన్నప్పుడే తల్లి మరణించగా తండ్రి దినసరి కూలిగా పనికి వెళ్తున్నాడు. ఒక సోదరి ఉన్నప్పటికి తాను ఒంటరిగా ఉండలేక పోతున్నానని పలుమార్లు ఇరుగుపొరుగువారితో చెప్పి బాధపడేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని మరణంపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement