దక్షిణ అమెరికాలోని గయానాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20మంది సజీవ దహనమైనట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సెంట్రల్ గయానా మైనింగ్ పట్టణంలోని మహదియా సెకండరీ స్కూల్ లో ఆదివారం రాత్రి ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరికొంతమంది గాయపడినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -