పాకిస్థాన్‌లో విషాధం చోటుచేసుకుంది. యాత్రికుల బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది యాత్రికులు మృతిచెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బలోచిస్తాన్ ప్రావిన్సులో జరిగింది.
కుజ్‌దార్ జిల్లాలో ఉన్న సూఫీ మసీదు షా నురానీ వద్ద ప్రార్థనలు చేసేందుకు యాత్రికులు బస్సులో వెళ్తున్నారు. అయితే కరాచీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో బస్సు ప్రమాదానికి గురైంది.
మృతుల కుటుంబాలకు మంత్రి మోషిన్ నక్వీ సంతాపం తెలిపారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల.. బస్సు లోయలో పడినట్లు తెలుస్తోంది. బస్సులో ఉన్నవారంతా సింధ్ ప్రావిన్సులో ఉన్న తట్ట పట్టణానికి చెందిన ప్యాసింజెర్లుగా గుర్తించారు. ఈద్ రోజున మధ్యాహ్నం 2 గంటలకు తట్టా పట్టణం నుంచి బస్సు బయలుదేరింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని కరాచీ సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు.