కృష్ణా : పామర్రులోని తోట్లవల్లూరు మండలంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. శివరాత్రి సందర్భంగా నదీస్నానం చేయడం కోసం చరణ్(18) అనే యువకుడు కృష్ణా నదిలో దిగాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడు ఉయ్యూరుకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement