ఉత్తరప్రదేశ్‌లో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనేది మరోమారు వెల్లడయ్యింది. నవీన్ బస్తీ వెస్ట్‌లో నివాసం ఉంటున్న ప్రబల్ ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20) పొరపాటున వేడి నీటితో నిండిన బకెట్‌లోని వాటర్ హీటర్‌ను ముట్టుకుని విద్యుదాఘానికి గురై, అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు అంజలి చనిపోయిందని నిర్ధారించారు. అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేదు. దీంతో మృతురాలి సోదరుడు సాహసం చేశాడు. ఆ మృతదేహాన్ని బైక్‌పై ఉంచి, దానిని చున్నీతో తన నడుముకు కట్టుకుని, వెనుకగా మరో సోదరిని కూర్చోబెట్టుకుని బైక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు.. దీనిని గమనించి కూడా ఆసుపత్రి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో విమర్శలువెల్లువెత్తుతున్నాయి..
Advertisement
తాజా వార్తలు
Advertisement