సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్నారు ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్. ఆమె.. నవంబర్ 17న పంజాబీలోని లూథియానాలో తుదిశ్వాస విడిచారు. 1976లో వెండితెరకు పరిచయమైన దల్జీత్.. పుట్ జట్టన్ దే, కీ బాను దునియా దా, సర్పంచ్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
పంజాబ్లో అగ్రకథానాయికగా పేరు సంపాదించుకున్న ఆమె.. దాదాపు 70 పంజాబీ చిత్రాల్లో.. 10కి పైగా హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు. దల్జీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దల్జీత్ కౌర్.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. పూణే ఫిల్మ్ ఇన్ స్టి్ట్యూట్ లో చేరారు. తన భర్త హర్మిందర్ సింగ్ డియోల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత చాలా కాలం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. 2001 లో మళ్లీ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు దల్జీత్.