Monday, November 18, 2024

Accident | ఢిల్లీలో ఘోరం.. ఫ్యాష‌న్‌లో ప్ర‌మాదం, మోడ‌ల్ మృతి

ఢిల్లీ నోయిడాలోని ఫిల్మ్ సిటీలో ప్ర‌మాదం జ‌రిగింది. ఓ స్టూడియోలో జరిగిన ఫ్యాషన్ షోలో విషాదకర ఘటన నెల‌కొంది. లైటింగ్ పోల్ కుప్ప‌కూలి మోడల్‌పై పడడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో మోడల్‌కు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సెక్టార్‌ 27లోని కైలాస్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

సెక్టార్-20 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ సిటీలో ఉన్న స్టూడియోలో ఫ్యాషన్ షో నిర్వహించారు. మృతురాలిని గ్రేటర్‌ నోయిడా వెస్ట్‌లోని దివ్యాన్ష్ ఫ్లోరా హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల మోడల్ వంశిక చోప్రాగా గుర్తించారు. షో కొనసాగుతున్న సమయంలో లైటింగ్‌ ట్రస్‌ విరిగి వంశికపై పడిపోయింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో బాబీ రాజ్‌ అనే మోడల్‌ సైతం గాయపడగా.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిర్వాహకులతో పాటు లైటింగ్‌ ట్రస్‌ ఏర్పాటు చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచార‌ణ జ‌రుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement