పండుగపూట కరీంనగర్లో విషాదం నెలకొంది. మానేరు వంతెన వద్ద ఈత కోసం వెళ్లిన బాలురు నీటమునిగారు. హోలీ సంబురాల్లో రంగులు చల్లుకుని సంతోషంగా గడిపిన దోస్తులంతా సేద తీరేందకు మానేరులో ఈత కోసం వెళ్లారు. వీరిలో వీరాంజనేయులు, అనిల్, సంతోష్ 12, 13, 14 సంవత్సరాల పిల్లలున్నారు. నీళ్లలోకి దిగి ఈత రాక నీట మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఒక బాలుడి మృతదేహం మాత్రం పోలీసులు బయటికి తీశారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు.
- Advertisement -