Sunday, January 12, 2025

HYD | మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అలర్ట్ ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్ ఫెస్టివల్ జ‌ర‌గ‌నుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని 13 నుంచి 15వ తేదీ వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

ఈ మార్గాల్లో ఆంక్షలు..

  • రోటరీ ఎక్స్‌ రోడ్డు నుంచి ఎస్‌బీహెచ్‌కు వెళ్లే రోడ్డును.. వైఎంసీఏ నుంచి క్లాక్‌ టవర్‌ వైపు మళ్లిస్తారు.
  • రసూల్‌పురా నుంచి ప్లాజా వెళ్లే దారిని.. సీటీఓ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి బాలన్‌రై వైపు మళ్లించారు.
  • పికెట్ నుండి ఎస్బీహెచ్ & టివోలికి వెళ్లే మార్గం.. స్వీకర్ ఉపకార్ వద్ద వైఎంసీఏకి మళ్లించారు.
  • ఎన్‌సీసీ నుంచి ప్లాజా వెళ్లే మార్గాన్ని.. టివోలీ నుంచి బ్రూక్‌బాండ్‌కు మళ్లిస్తున్నారు.

గేట్ నంబర్.1 నుండి పబ్లిక్ ఎంట్రీకి అనుమతి ఉంటుందని… ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని… ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement