రెండ్రోజులపాటు గెరువిచ్చిన వాన హైదరాబాద్‌లో మళ్లీ మొదలయ్యింది. ఆదివారం సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్టు సమాచారం అందుతోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, హైదరాబాద్‌లోని కూకట్పల్లి, బాలానగర్, నిజాంపేట్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్‌లోని మెయిన్రూట్లలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
- Advertisement -