ఢిల్లీ-లక్నో NH9 హైవేపై సోమవారం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సోమవతి అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు గర్ గంగా చేరుకున్నారు. భారీ వాహనాలను రూట్ మళ్లించినప్పటికీ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులతోపాటు ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకున్నారు. ట్రాఫిక్‌ను అదుపు చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలం కావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
భక్తుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ “మీరు ఈ రోజు ఢిల్లీ నుండి లక్నోకు వెళ్లాలనుకుంటే అమ్రోహా సమీపంలోని గర్ గంగాలో స్నానాలు చేస్తున్న భక్తుల రద్దీ కారణంగా గంటల తరబడి చిక్కుకుపోవచ్చు. అక్కడ 10- కి.మీ పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సమయంలో పోలీసులు దానినిసరిచేయడంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. అందరూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు” అని పేర్కొన్నాడు .