Friday, November 22, 2024

Traditional festival – లక్షలాది భక్త జన సందోహం మధ్య వైభవంగా సిరిమాను ఉత్సవం…

విజయనగరం, ,అక్టోబర్ 31(ప్రభ న్యూస్): ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవం వైభవంగా జరిగింది.. సాయంత్రం 4.18 నిమిషాలకు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ను పూజారి బంటుపల్లి వెంకటరావు అధిరోహించారు. 4.37 కి సిరిమాను రథోత్సవం ప్రారంభమైంది .- జాలరివల, పాల ధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ముందు నడవగా లక్షలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సిరిమాను రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీ పైడితల్లి అమ్మవారు. – తన పుట్టినిల్లు విజయనగరం కోట వద్దకు వెళ్లి, రాజ కుటుంబాన్ని, భక్తులను ఆశీర్వదించిన అమ్మవారు.- కోట పై నుంచి సిరిమాను సంబరాన్ని తిలకించారు ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యులు.- జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణ లో ఆశీనులై, సిరిమానోత్సవాన్ని తిలకించారు మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు.-

.కాగా,రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన విజయనగరం చేరుకుని పైడితల్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి అమర్నాథుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ ఈవో మంత్రి అమర్నాథ్కు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మంత్రి అమర్నాథ్ సిరిమాను ఉత్సవంలో పాల్గొన్నారు. మంత్రి అమర్నాథ్ తో పాటు డిప్యూటీస్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement