Tuesday, December 3, 2024

Trading Lessons – హైదరాబాద్‌లో టీఐసీ అకాడమీ..

అందరికీ అర్థమయ్యే భాషలో ట్రేడింగ్‌ పాఠాలు
ఫైనాన్షియ‌ల్ మార్కెటింగ్‌పై అవ‌గాహ‌న‌
ట్రేడింగ్ నేర్చుకోవ‌చ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైదరాబాద్‌:
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ హర్మనీ ప్లాజాలో టీఐసీ అకాడమీని ది ఇన్వెస్టర్‌ కో (టీఐసీ) ఏర్పాటు చేసింది. దీన్ని సంస్థ ఫౌండర్లు రక్షత్‌ గోయెల్‌, టీఐసీ మాస్టర్‌ ఫ్రాంచైజీ నిర్వాహకులు విశ్వనాథ్‌ సామా, అకాడమీ ప్రాంచైజీ నిర్వాహకులు సంజయ్‌ దోల్వానీ సోమ‌వారం ప్రారంభించారు. అకాడమీలో అందరికీ అర్థమయ్యే భాషలో స్టాక్‌ మార్కెట్‌, ట్రేడింగ్‌ గురించి నేర్పుతార‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

ఫైనాన్షియ‌ల్ మార్కెంటింగ్‌పై అవ‌గాహ‌న కోస‌మే..

- Advertisement -

ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌ ట్రేడింగ్ అందుబాటులో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో టీఐసీ అకాడమీని మొదలు పెట్టామని సంస్థ వెల్లడించింది. ఇక్కడ ట్రేడింగ్‌ నేర్చుకోవచ్చని, ప్రాక్టీస్‌ చేయొచ్చని, సంపాదించుకోవచ్చని తెలిపింది. ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో ప్రతి వ్యక్తికి నాలెడ్జి, స్కిల్స్‌, మార్కెట్‌లో సంక్లిష్టతలను అధిగమించి విశ్వాసాన్ని, విజయం సాధించడానికి దారిచూపడమే తమ లక్ష్యమని పేర్కొంది. తమ సొంత క్యాపిటల్‌తోనే ట్రేడింగ్‌పై శిక్షణ ఇస్తామని వెల్లడించింది. పెట్టుబడుల చుట్టూ అలముకున్న అయోమయాన్ని తొలగించి విశాలమైన ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ప్రవేశించడానికి ముందు ఒక పటిష్టమైన తొలి అడుగు వేయడానికి టీఐసీ సహాయపడుతుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement