Friday, November 22, 2024

వాణిజ్య లోటు సంవత్సరం కనిష్టానికి చేరుకుంది.. బాహ్య డిమాండులో క్షీణతే కారణం

జనవరిలో భారతదేశ వాణిజ్య లోటు ఒక సంవత్సరంలో కనిష్ట స్థాయి 17.75 బిలియన్‌ డాలర్లను తాకింది. వాణిజ్య వస్తువుల ఎగుమతులు, దిగుమతులు రెండూ వరుసగా రెండవ నెలలో కుదించుకుపోయి, బాహ్య డిమాండు, బంగారం దిగుమతులలో తీవ్ర క్షీణత కారణంగా ఈ లోటును చవిచూడాల్సి వచ్చింది. ద్రవ్య విధానం కఠినతరం, అధిక ద్రవ్యోల్బణం కారణంగా అభివృద్ధి చెందిన కీలక ఆర్థిక వ్యవస్థల నుంచి డిమాండు మందగించడంతో గత నెలలో సరుకుల ఎగుమతులు ఏడాదికి 6.5 శాతం పడిపోయి 32.91 బిలయన్‌ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది.

దిగుమతులు ఏడాదికి 3.6 శాతం తగ్గి, 50.66 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. క్షీణత 13 శాతం వద్ద సీక్వెన్షియల్‌ ప్రాతిపదికను పదునుగా ఉంది. అనవసరమైన దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు, బలహీన దేశీయ డిమాండు, వస్తువుల ధరలను తగ్గించడం వంటి అంశాల కలయిక దీనికి కారణం. కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ) పెరగడానికి గణనీయంగా దోహదపడే బంగారం దిగుమతులు 70.70 శాతం క్షీణించి 697 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. బయటి డిమాండుకు పెరుగుతున్న నష్టాల మధ్య, ప్రభుత్వం సీఏడీ గురించి ఆందోళన చెందుతోంది.

- Advertisement -

అనవసరమైన దిగుమతులను అరికట్టడంపై దృష్టి సారించడం వల్ల దిగుమతులు తగ్గాయి. ఇది మంచి సంకేతం అని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్త్‌వాల్‌ అన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం విజయవంతమైందని ఆయన అన్నారు. చమురు దిగుమతులు వ్యయం వరుసగా తగ్గడం వల్ల వాణిజ్య లోటు తగ్గముఖం పట్టిందని ఐసీఆర్‌ఏ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ అన్నారు. మార్చి త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా లోటును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. రెండవ త్రైమాసికం( జులై-సెప్టెంబర్‌)లో సీఏడీ గరిష్ట స్థాయికి చేరుకోగా మూడవ త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌), నాలుగవ త్రైమాసికం (జనవరి-మార్చి)లో వరుసగా మోడరేట్‌ అవుతుందని మేము విశ్వసిస్తున్నామని నాయర్‌ చెప్పారు.

భారత్‌ ఎగుమతులు జనవరిలో 30 రంగాలలోని 19 రంగాల్లో వార్షిక సంకోచాన్ని చవిచూశాయి. అభరణాలు (19.28 శాతం), డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ (2.62), కెమికల్స్‌ (4.57), ఇంజినీరింగ్‌ గూడ్స్‌ (9.8) రెడీమేడ్‌ గార్మెంట్స్‌ (3.48 శాతం) జనవరిలో క్షీణించిన ప్రధాన ఎగుమతి వస్తువులు. అయితే ఎలక్ట్రానిక్‌ వస్తువులు (55.54), పెట్రోలియం ఉత్పత్తులు (8 శాతం) వృద్ధిని సాధించిన రంగాలు.

ప్రపంచ ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ పరిస్థితి రెండూ బాగా మెరుగపడకపోతే రాబోయే నెలలు సవాలుగా పరిణమిస్తాయని ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈవో) అధ్యక్షుడు ఏ. శక్తివేల్‌ అన్నారు. అయితే, మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 4-5 శాతం వృద్ధితో దాదాపు 440-445 బిలియన్‌ డాలర్లను తాకడం ద్వారా మునుపటి సంవత్సరం ఎగుమతి లక్ష్యాన్ని చాలా సులభంగా అధిగమించామని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement