Tuesday, November 26, 2024

ఆడియో క్లిప్ నిజమని తేలితే కౌశిక్‌రెడ్డిపై వేటు: రేవంత్

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే రాబోతోందంటూ ఆయన మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఆయనకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది.

మరోవైపు ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిందారు. ఇలాంటి చర్యలను సమర్థించబోమని ఆయన అన్నారు. కౌశిక్ రెడ్డికి ఇప్పటికే తమ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఆడియో క్లిప్ నిజమని తేలితే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నారు. ఇంకోవైపు కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వస్తుందంటూ కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఈ వార్త కూడా చదవండి: కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ అంటూ ఆడియో క్లిప్ వైరల్

Advertisement

తాజా వార్తలు

Advertisement