Saturday, November 23, 2024

సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఖమ్మం జైలులో ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించి మానవ హక్కుల ఉల్లంఘన చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో రేవంత్ రెడ్డి కోరారు. సెప్టెంబర్ 17లోగా రాష్ట్రంలోని పోడు భూముల అన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

గిరిజనులు, ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన ఐటీడీఏలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో శిథిలావస్థకు చేరుకున్నాయని రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తక్షణం వాటిని పునరుద్ధరించే విధంగా నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు దళిత, గిరిజన, ఆత్మగౌరవ దండోరాలతో ప్రజాక్షేత్రంలో కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరును మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం తన బుద్దిని మార్చుకోవాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు.

ఈ వార్తను కూడా చదవండి: ఏపీలో ఈనెల 14తో ముగియనున్న నైట్ కర్ఫ్యూ

Advertisement

తాజా వార్తలు

Advertisement