కార్బన్ ఉద్గారాలను సున్నా చేయాలనే లక్ష్యంలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ, జపాన్‌కు చెందిన టొయోటా మోటార్ కార్ప్ కీలకమైన ప్రకటన చేసింది. 2030 నాటికి 30 మోడళ్ల బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్(బీఈవీ) ఆవిష్కరించడం లక్ష్యంగా 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి 8 ట్రిలియన్ యెన్‌లు ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో భాగంగా ఈ పెట్టుబడి పెట్టనున్నట్టు టొయోటా పేర్కొంది. ఈ దశాబ్దం చివరి నాటికి హైబ్రీడ్, హైడ్రోజన్ వెహికిల్స్ తయారు చేయనున్నామని కంపెనీ వివరించింది. 2030 నాటికి 3.5 మిలియన్ బీఈవీల వార్షిక విక్రయాలు జరపాలని భావిస్తున్నట్టు కంపెనీ సీఈవో అకియో తెలిపారు.
2025 నాటికి 15 కొత్త మోడళ్ల తీసుకొస్తామని గత ప్రకటనతో సంబంధం లేదని ఆయన వివరించారు. కాగా హైబ్రీడ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసిన తొలి సంస్థ టొయోటా కావడం గమనార్హం. అయితే పూర్తి స్థాయిలో ఈవీ తయారీ సంస్థగా మారతామని ఆలస్యంగా ప్రకటన చేసింది. బ్యాటరీ ఉత్పత్తి కోసం 2030 నాటికి 2 ట్రిలియన్ యెన్‌లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఇప్పటికే 1.5 ట్రిలియన్ యెన్‌లు ప్రకటించగా.. ఆ మొత్తాన్ని 2 ట్రిలియన్ యెన్‌లకు పెంచినట్టు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అయితే ఈ మార్కెట్ వేగంగా పెరుగుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital