భారత్‌లో ఈ నెల ప్రారంభంలో హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు మిరాయ్‌ను లాంచ్ చేస్తున్నట్టు టయోటా కంపెనీ బుధవారం ప్రకటించింది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ)తో కంపెనీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా.. హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విద్యుత్‌తో నడిచే కారును టయోటా విడుదల చేసింది. మార్చి16న నితిన్ గడ్కరీ ప్రారంభించిన టయోటా మిరాయ్.. భారతదేశపు మొట్టమొదటి ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్ (ఎఫ్‌సీఈవీ). మిరాయ్ ఫుల్ ట్యాంకుతో 600 కి.మీ ప్రయాణించొచ్చు. గ్రీన్ హైడ్రోజన్‌ను ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది.
సెకండ్ జనరేషన్ కారు కర్ణాటకలోని టయోటా ప్లాంట్‌లో తయారు చేయబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2020లోనే పరిచం చేశారు. 5 సీటర్స్ సెడాన్ ధర ఇంకా భారత్‌లో ప్రకటించలేదు. సింగిల్ స్పీడ్ ఆటోమెటిక్ కారు ధర 66వేల డాలర్లుగా టయోటా ప్రకటించింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.50లక్షలు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. హైడ్రోజన్ కారులోనే పార్లమెంట్‌కు వెళ్లడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..