ప్రముఖ కార్ల కంపెనీ టొయోటా ఇవ్వాల (సోమవారం) భారత మార్కెట్ లో కొత్త కార్ ని లాంచ్ చేసింది. ‘టయోటా రూమియాన్’ పేరుతో రిలీజ్ అయిన ఈ కారు 7-సీటర్ తో అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. టయోటా నుంచి నేడు మార్కెట్ లో రిలీజ్ అయిన ‘టయోటా రూమియాన్‘ కారు మొత్తం 3 వేరియంట్లు, 6 ట్రిమ్‌లలో లాంచ్ అయ్యింది.
ఇందులో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. టయోటా రూమియన్ ధర రూ.10.29 లక్షల నుండి రూ.11.24 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతోంది. వినియోగదారులు రూ.11,000 టోకెన్ ప్రీ బుక్ చేసుకోవచ్చు. దీని CNG వేరియంట్ ధర రూ.11.24 లక్షలు నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు 26 కిమీ వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
టయోటా రూమియన్ ఫీచర్స్
సరికొత్త టయోటా రూమియన్ కారు విశాలమైన క్యాబిన్, ఇంటీరియర్లలో కనిపించే అధునాతన ఫీచర్ల కారణంగా కస్టమర్లకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కంపెనీ ఈ కారులో పెట్రోల్ ఇంజన్‌తో పాటు నియో డ్రైవ్ (ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ – ఐఎస్‌జి) టెక్నాలజీ & ఇ-సిఎన్జి టెక్నాలజీని అమర్చింది. టయోటా రూమియన్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో కూడిన 17.78 సెం.మీ స్మార్ట్ ప్లే కాస్ట్ టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్, 55 ప్లస్ ఫీచర్లతో టయోటా ఐ-కనెక్ట్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్, లాక్/అన్‌లాక్, స్మార్ట్‌వాచ్ అనుకూలత వంటి ఫీచర్లను పొందుతుంది.
టయోటా రూమియన్ ఇంజన్ & మైలేజ్
కంపెనీ టయోటా రూమియన్‌లో 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించింది. పెట్రోల్ మోడ్‌లో 75.8 kW పవర్ అవుట్‌పుట్ & 136.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఈ కారు. ఇక, CNG మోడ్‌లో, ఈ ఇంజన్ 64.6 kw శక్తిని & 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా అందుబాటులో ఉంది.
ఇక మైలేజ్ విషయాని వస్తే… కొత్త నియో డ్రైవ్ టెక్నాలజీ & E-CNG టెక్నాలజీ ఈ కారు మైలేజీని మెరుగుపరుస్తాయని కంపెనీ తెలిపింది. టయోటా దాని పెట్రోల్ వెర్షన్ 20.51 kmpl మైలేజీని అందిస్తుందని, CNG వేరియంట్ 26.11 kmpl వరకు డెలివరీ చేస్తుందని పేర్కొంది.