దేశంలో వాహనాల ధరలు మరింత పెరగనున్నాయి. ఒక తయారీ కంపెనీ తమ వాహనాల ధరలను పెంచితే మిగిలినవన్నీ దాన్ని అనుసరించడం ఆటోమొబైల్ సెక్టార్‌లో జరుగుతుంది. అదే బాటలో టయోటా పయనిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వాహనాల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. 2022—23 ఆర్థిక సంవత్సరం తొలిరోజు నుంచే పెంచిన రేట్లు అమల్లోకి రానున్నాయి. తమ వాహనాల రేట్లను 4 శాతం మేర పెంచనున్నట్లు టయోటా కిర్లోస్కర్ ప్రకటించింది. అన్ని మోడల్స్ కార్ల రేట్లనూ పెంచనున్నట్లు స్పష్టం చేసింది.
నాలుగుశాతం వరకు వాటి రేట్లను సవరించినట్లు వివరించింది. కార్ల తయారీలో వినియోగించే పరికరాలు, విడిభాగాల ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఇన్‌పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని, దాని ప్రభావం వాహనాల తయారీపై పడిందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...