హైదరాబాద్, ఆంధధ్రప్రదేశ్: ట్రెక్కింగ్‌కు అనుకూలమైన చారిత్రాత్మక ప్రదేశాల్లో పర్యాటకరంగాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. విదేశీలను కూడా ఆకట్టుకునే అనేక స్థలాలు ట్రేక్కింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తరాది కంటే దక్షిణాధిలోనే చరిత్రాత్మక ప్రదేశాల్లొట్రెక్కింగ్ నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు పర్యాటక శాఖ అంచనావేస్తుంది. బెంగూళూరు, హిమాలయాలు, లఢక్,ఉత్తరాఖాండ్, కర్ణాటక కు ట్రెక్కింగ్‌కు వెళ్లేవారంతా భవిష్యత్ లో తెలంగాణ వైపు చూసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ట్రెక్కింగ్ ప్రదేశాలు అనేకం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
హైదరాబాద్‌కు 54 కిలో మీటర్ల దూరంలో ఉన్న భువనగిరి ఏకశిలా రాతి గుట్టపై ట్రెక్కింగ్ చేసేందుకు అనేక ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం చేసింది. రాష్ట్రంలోని అత్యంత ప్రాచీనమైన గిరిదుర్గం బోనగిరికోటకు ట్రెక్కింగ్ ద్వారావెళ్లి కొండపైబాగాన చేరుకుని నందివిగ్రహం, ఆంజనేయ శిల్పం, సొరంగాలు, కోటదర్వాజలు, శత్రులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన కట్టడాలు, అంతపురాలు, రాజప్రముఖుల నివాసాలు, గుట్టపై జలాశయాన్ని చూసేందుకు ఆసక్తిగా ట్రెక్కింగ్ చేయడానికి సరిహద్దురాష్ట్రాలనుంచి కూడావస్తున్నారు.
అలాగే రాతి తొట్టెలు, చాళుక్యుల శిల్పరీతులు, రాజప్రసాదాలు, పుష్పాలంకరణలు శిల్పకళాకృతులు ఇక్కడ అనేకం ఉన్నాయి.
ఈ నేపథ్యంలో భువనగిరి ట్రెక్కింగ్‌కు కేరాఫ్‌గా మారింది. 610 మీటర్ల ఎత్తులో 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం పర్వతారోహణకు అనుకూలంగా ఉంది. రాష్ట్రంలోని ఉర్లుకొండ, ఉండ్రుకొండ, అనంతగిరులకంటే ఎత్తయిన భువనగిరిని దక్షిణం నుంచి చూస్తే తాబేలుగా, పడమరనుంచి చూస్తే పడుకున్న ఏనుగులా ఉంటున్న ఈ కొండపై ట్రెక్కింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కళాశాల విద్యార్థులకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా ఉన్నయి. అలాగే అనంతగిరి, కాకతీయ రాజులు నిర్మించిన మెదక్ పోర్టు, మహబూబ్ నగర్ జిల్లాలో కాకతీయ సామంతులు నిర్మించిన ఘణపురం కోట, అనేక చరిత్ర సంపదకు నిలయంగా ఉన్న కోయిల్ కొండ,ఆదిలాబాద్ జిల్లాలోని గాయత్రి జలపాతం, అలాగే మరో సుందరప్రదేశం కనకై జలపాతాలు, అమెజాన్ అడవులను తలపించే విధంగా ఉన్న చిక్కని అడవిలో చక్కని కౌలాస్ కోట,నల్లమల అడవుల్లోని జలపాతాల్లో ట్రెక్కింగ్ కు అవకాశాలు ఉన్నయి.
అయితే ఇప్పటికే పలువురు అడ్వెంచర్ క్లబ్, యూత్ క్లబ్ ల ద్వారా ఈ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి ట్రెక్కర్స్ వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధంచేస్తుంది. ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామంగా మారుతుంది. ఇప్పటికే సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న నల్లమల ట్రెక్కింగ్ కు నిలయంగా మారనుంది. నల్లమల అడవుల్లో ఉన్న శ్రీశైలానికి యాత్రికులు అధికసంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అడవిలోని వీర్ల కొండను ట్రేక్కింగ్ కు అనుకూలంగా తీర్చి దిద్ది సౌకర్యాలను కల్పించాలని ఇప్పటికే కేంద్రం సర్వేచేసింది.