Tuesday, November 26, 2024

టూరిజం ప్రమోషన్‌ అవార్డులు.. ఈ నెల 30 వరకు దరఖాస్తుకు గడువు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొంది పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లు, క్లాసిఫైడ్‌ హోటళ్లు, రెస్టారెంట్లు, ఇండిపెండెంట్‌ హోటళ్లకు రాష్ట్ర పర్యాటకశాఖ అవార్డులను ప్రదానం చేయనుంది. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను బహూకరించనున్నారు. ‘ రీ థింకింగ్‌ టూరిజం’ అనే థీమ్‌తో ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వనున్నట్లు పర్యాటకశాఖ తెలిపింది. తెలంగాణకు పర్యాటకులను ఆకర్షించే విధంగా రచన/ప్రచురుణలు రూపొందించిన, తెలంగాణ టూరిజంపై ఉత్తమ చిత్రం రూపొందించిన , అత్యాధునిక వసతులతో పర్యాటకులను ఆకట్టుకుంఉటన్న టూర్‌, ట్రావెల్‌ ఏజెంట్లకు, ఉత్తమ రెస్టారెంట్లకు, ఉత్తమ పర్యాటక గైడ్‌లకు, ఉత్తమ పౌర నిర్వహణ, ఉత్తమ గ్రామీణ పర్యాటక వ్యవస్థ ఇలా 11 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు.

వ్యక్తులు, సంస్థలు తమ దరఖాస్తులను హైదరాబాద్‌లోని పర్యాటకశాఖ కమిషనర్‌ కార్యాలయంలో నేరుగా లేదా టూరిజం వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించవచ్చని పర్యాటక శాఖ తెలిపింది. దరఖాస్తులను… ప్రాంతీయ పర్యాటచ సమాచార కేంద్రం, జీ -33, కలెక్టర్‌ ఆఫీస్‌, హన్మ్‌ండ, ఫోన్‌ 0870-2459201, జిల్లా పర్యాటక శాఖ కార్యాలయం, జిల్లా పరిషత్‌, నల్గొండ, ఫోర్‌ 08682-222055 చిరునామాకు పంపించాలని సూచించింది. దరఖాస్తులను ఆగస్టు 30 తేదీలోపు సమర్పించాలని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement