అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పురపాలక సంఘాల స్వయం సంవృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. నగరాలు.. పట్టణాల్లో అందుబాటులో ఉన్న వనరుల వినియోగంతో అటు ఆర్థికాభివృద్ధితో పాటు ఇటు ప్రజలకు ఆహ్లాదాన్ని నింపే దిశగా కొత్త ఆలోచనలు చేస్తోంది.. కృష్ణా, గోదావరి నదులకు 12 ఏళ్ల కోసారి వచ్చే పుష్కరాల్లో భక్తుల సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.. ఇందులో భాగంగా నదీ తీర నగరాల్లో అడుగడుగునా పుష్కర ఘాట్లు వెలిశాయి. అయితే పుష్కరాల తరువాత అవి అలంకార ప్రాయంగా మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పుష్కర్ ప్లాజాలుగా తీర్చిదిద్దేందుకు పురపాలకశాఖ కసరత్తు జరుపుతోంది. విజయవాడ, రాజమహేంద్రవరంలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన రైల్, రోడ్డు వం తెనలు, ఆ సమీపంలోనే పుష్కరఘాట్లు ఉన్నాయి.
వీటిని ఆధునీకరించి నగర ప్రజలకు అందుబాటులోకి తేవటంతో పాటు టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు పురపాలకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలిసారిగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో నగరంలో పుష్కర్ ఘాట్ రైల్వే బ్రిడ్జి ఆనుకొని ఉన్న స్థలాన్ని నగర ప్రజలు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రదేశం లో సీటింగ్, ఆర్కిటెక్చరల్ లైటింగ్ మరియు స్ట్రీట్ర్ ఆర్ట్‌తో అందంగా పుష్కర్ ప్లాజాను అభివృద్ధి చేశారు. నగరపాలక సంస్థ కొత్తగా అభివృద్ధి చేసిన పుష్కర్ ప్లాజాలో విచ్చేసినవారు వీక్షించేందుకు ఓపెన్ మూవీ స్కీన్రింగ్‌తో కూడిన ఆహారం, ఉచిత వై-ఫై జోన్‌ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంతం మరింత మంది ప్రజలను ఆకర్షించడానికి మరియు పబ్లిక్ ప్లాజాగా పని చేయడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పనులు చేపట్టారు.
పేవర్లు, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలతో పాటు- అలంకారమైన కాంటెంపరరీ లైటింగ్, వివిధ రకాల సీటింగ్‌లు, సీటింగ్ బోలార్డ్‌లు, ఆకర్షణీయమైన నేపథ్య చిత్రాలు నగర ప్రజల్ని ఆకర్షించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్కరప్లాజాల పరిధిలో ఫుడ్ జోన్‌లు ఎక్కువ మంది ప్రజలను ఆకర్షిస్తాయని, రోజంతా అందుబాటులో ఉంచటం ద్వారా పురపాలక సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించగలవని ప్రభుత్వం భావిస్తోంది. రాజమహేంద్రవరంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ప్లాజాలో, వివిధ రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉండేలా అవుట్‌లె ట్లను ఏర్పాటు చేయడానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు కమిషనర్ కే దినేష్‌కుమార్ తెలిపారు. ఆసక్తిగల వ్యాపారులకు ఫుడ్ ఔ-్లటట్ల నిర్వహణ, వై-ఫై వెసులుబాటు, ఓపెన్ స్కీన్రింగ్ ఏర్పాటు చేసి, శానిటేషన్ మరియు నిర్వహణ బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారు.
పుష్కర ప్లాజాల్లో ఏర్పాటయ్యే తినుబండారాల అవుట్‌లెట్‌లు దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో తరచుగా కనిపించే ఆహార ప్రియులకు అంతర్జాతీయ స్థాయిలో ఏది కోరితే అది అందించాలని లక్ష్యంగా ఏర్పాటుకానున్నాయి. ఇందుకు సంబంధించి టెండర్లను త్వరలో ఆహ్వానించనున్నారు. విజయవాడ ఆధ్యాత్మికంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయానికి పెద్దఎత్తున తరలివచ్చే భక్తులతో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదాన్ని నింపేలా పుష్కర ఘాట్ల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. ఓ వైపు ప్రకాశం బ్యారేజీ, మరోవైపు కనకదుర్గమ్మ వారధితో పాటు మధ్యలో రైల్ వంతెన ఉన్నాయి. ఈ ప్రాంతంలో పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయటం వల్ల పర్యాటక, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్మార్ట్ నగరాలే లక్ష్యం – పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి
రాష్ట్రంలో స్మార్ట్ నగరాలు.. పట్టణాలే లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఆంధ్రప్రభ కు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు నగరాలు.. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన.. వనరుల వినియోగం.. పర్యాటక కేంద్రాల విస్తరణతో ప్రజలకు ఆహ్లాదాన్ని నిం పేలా కార్యాచరణ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా నవీనీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. తద్వారా పురపాలక సంఘాలు స్వయం పోషకాలుగా ఆర్థికాభివృద్ధిని సాధించగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.