రాజన్న సిరిసిల్ల : సీఎం రేవంత్‌రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడ పట్టణంలో సీఎం పర్యటించిన అనంతరం రాజన్నను దర్శించుకుని పూజలు చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి అతిథి గృహానికి వెళ్లి, భోజనం చేసి తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్తారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వేములవాడకు మంత్రులు .
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు చేరుకున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు దుదిల్ల శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ చేరుకున్నారు. దేవాదాయ శాఖ అధికారిని శైలజ రామయ్యర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి పర్యటన కోసం వేములవాడకు చేరుకున్నారు. మంత్రులకు జిల్లా ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
సీఎం పర్యటన షెడ్యూల్
ఉదయం 9.45 గంటలకు హెలికాప్టర్‌లో వేములవాడలోని గుడిచెరువు గ్రౌండ్‌కు చేరుకుంటారు.9.55 గంటలకు దేవస్థానం అతిథిగృహానికి వెళ్తారు.10.10 నుంచి 11.45 గంటల వరకు రాజన్నను దర్శించుకొని, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు11.55 గంటలకు ఎస్సారార్ అతిథి గృహానికి వెళ్తారు.12.30 నుంచి 1.40వరకు గుడి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు1.45 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.