రెండు రోజుల పర్యటన
నేటి ఉదయం ఢిల్లీ నుంచి పయనం
ధింపు విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని స్వాగతం
దారిపొడవునా ఆ దేశ ప్రజల మానవ హారం
అబివాదం చేస్తూ ముందుకు సాగిన ప్రధాని
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూటాన్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోదీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయ్యారు. అక్కడ ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ కి ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు.
అనంతరం పారో నుండి థింఫు వరకు మొత్తం 45 కిలో మీటర్ల పొడవున నిలబడిన ఆ దేశస్తులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. మోదీ వెళ్లే దారిలో మానవ హారంగా ఉన్న ప్రజలకు ప్రధాని అభివాదం చేస్తూ ముందుకు సాగారు.. తాజా పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. అదేవిధంగా రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు మోదీ హాజరుకానున్నారు.
- Advertisement -