Saturday, November 23, 2024

తౌక్టే తుఫాన్…. ప్రభావం ఎక్కడ ఉందో తెలుసా ?

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. కాగా అది ఇవాళ తుఫాన్ గా మారనుందని వాతావరణం శాఖ హెచ్చరించింది. దీనికి తౌక్టే అనే పేరు కూడా పెట్టారు. ఇది గుజరాత్ దగ్గర తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుఫాను కారణంగా గుజరాత్ కేరళ తోపాటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే తుఫాన్ తీరం దాటే సమయంలో 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. 24 బృందాలు వెంటనే రంగంలోకి దిగగా మిగిలిన బృందాలు ను తుఫాను తీవ్రతని బట్టి ముందుకు పంపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement