Monday, November 25, 2024

కుండపోత వర్షం.. అతలాకుతలమైన నగరం

ప్రభన్యూస్‌, హైదరాబాద్ : వర్షం హైదరాబాద్‌ నగరాన్ని మరోసారి ముంచెత్తింది. ఈ రోజు (శుక్ర‌వారం) ఉదయం నుంచి నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురవడంతో నగరం అతలాకుతమైంది. రాత్రి నుంచి దంచికొట్టిన వర్షానికి జన జీవనం స్తంభించింది. వర్షపు నీటికి తోడు డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ప్రధాన రహదారులు జలమయంగా మారడంతో పాటు లోతట్టు ప్రాంతాలు, బస్తీలను వరద నీరు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో వర్షంనీరు రోడ్లపై నిలవడంతో ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది.

మరో రెండు రోజులు వర్షాలు – వాతావరణ శాఖ :

ప్ర‌స్తుతం కురుస్తున్న వ‌ర్షంతో పాటు మ‌రో రెండు రోజులు తెలంగాణతో పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళా ఖాతంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు, మధ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. వీటి ప్రభావంతో తేలిక నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంద‌ని, ప్రజలు వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement