భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం (2022)లో ఊహించని హిట్‌ల నుండి భారీ బడ్జెట్ ఫ్లాప్‌ల వరకు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ ను చూసింది. ప్రేక్షకులు హీరోల స్టార్ పవర్ గురించి పట్టించుకోరని.. చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే భేదాలు సినీ ప్రేక్షకులకు లేవని తెలిసిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా మాత్రమే జనాలను థియేటర్లకు రప్పిస్తోందని నిరూపించింది.
అలాగే, బాక్సాఫీస్ కలెక్షన్లు, విమర్శకుల ప్రశంసలను పరిశీలిస్తే.. రెండింటిలోనూ దక్షిణ భారత సినిమాలు బాలీవుడ్ కంటే ముందున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్-శివ మాత్రం ఈ సంవత్సరపు టాప్ మూవీగా నిలిచింది.
సెర్చ్ ఇంజన్ Google 2022లో దేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది. కాగా, అందులో బాలీవుడ్ నుంచి వచ్చిన మల్టీ లాంగ్వెజ్ మూవీ బ్రహ్మాస్త్ర టాప్ లో ఉంది. ఆ టాప్ 10 లిస్ట్ లో అధిక భాగం సౌత్ ఇండియా సినిమాలే ఉండటం విశేషం. గూగుల్ రిలీజ్ చేసిన ఈ లిస్ట్ లో బాలీవుడ్ నుంచి కేవలం 4 హిందీ సినిమాలు మాత్రమే ఉన్నాయి.
2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల జాబితా..
1) బ్రహ్మాస్త్ర: మొదటి భాగం – శివ
దర్శకుడు: అయాన్ ముఖర్జీ
తారాగణం: రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్
2) K.G.F: చాప్టర్ 2
దర్శకుడు: ప్రశాంత్ నీల్
తారాగణం: యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్
3) కాశ్మీర్ ఫైల్స్
దర్శకుడు: వివేక్ అగ్నిహోత్రి
తారాగణం: అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి
4) RRR
దర్శకుడు: S.S. రాజమౌళి
తారాగణం: రామ్ చరణ్, N.T. రామారావు జూనియర్, అజయ్ దేవగన్, అలియా భట్, రే స్టీవెన్సన్
5) కాంతారా
దర్శకుడు: రిషబ్ శెట్టి
తారాగణం: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, మానసి సుధీర్
6) పుష్ప: ది రైజ్
దర్శకుడు: సుకుమార్
తారాగణం: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్
7) విక్రమ్
దర్శకుడు: లోకేష్ కనగరాజ్
తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, శివాని నారాయణన్
8) లాల్ సింగ్ చద్దా
దర్శకుడు: అద్వైత్ చందన్
తారాగణం: అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్
9) దృశ్యం-2 / హిందీ
దర్శకుడు: అభిషేక్ పాఠక్
తారాగణం: అజయ్ దేవగన్, అక్షయ్ ఖన్నా, టబు, శ్రియ శరణ్ మరియు ఇషితా దత్తా
10) థోర్: లవ్ అండ్ థండర్
దర్శకుడు: తైకా వెయిటిటి
తారాగణం: క్రిస్ హెమ్స్‌వర్త్, నటాలీ పోర్ట్‌మన్, క్రిస్టియన్ బేల్, రస్సెల్ క్రోవ్, టెస్సా థాంప్సన్