పవర్ స్టార్‌గా సినిమాల్లో రికార్డుల మోత
పొలిటికల్ స్టార్‌గా పాలిటిక్స్‌లో సరికొత్త రికార్డులు
రాజకీయాల్లోనూ అదే ఒరవడి చూపుతున్న లీడర్
కొత్త రోడ్ల నిర్మాణం, రిపేర్ల పరంగా ఫుల్ స్పీడప్
50 రోజుల్లో 11వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం
స్వాతంత్య్రం తర్వాత మా ఊరికి రోడ్డొచ్చింది
సంబురంగా చెప్పుకుంటున్న గిరిజనులు
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆయన పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఒకప్పుడు పవన్ సినిమా వస్తోందంటే.. ఆ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర్నుంచే రికార్డుల మోత షురూ అయ్యేది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ఆడియో సింగిల్స్, ప్రీ రిలీజ్ బిజినెస్, ఫస్డ్ డే కలెక్షన్స్.. ఇట్లా చెప్పుకుంటూ పోతే, ప్రతీదీ రికార్డే.. ఇక.. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా పవన్ సినిమాలకి వసూళ్ల జాతర ఉండేది. టాలీవుడ్లో ఒకప్పుడు ఆయనే హయ్యస్ట్ పెయిడ్ హీరోగా ఉన్నారు. ఇప్పుడూ సినిమాలు చేస్తున్నప్పటికీ అంతకంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.
రాజకీయాల్లో సూపర్ పవర్..
రాజకీయాల్లోనూ పవన్ అంటే సూపర్ పవర్ అన్నట్టుగా మారిపోయింది. ఈ మధ్య ఎన్నికల్లో 100 శాతం ఫ్రైక్ రేట్‌తో విజయాలు సాధించి విక్టరీ కొట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘పొలిటికల్ పవర్ స్టార్’ అంటూ పవన్ మారిపోయారు. మరి, ఆ స్థాయికి తగ్గట్టు డిప్యూటీ సీఎం హెూదాలో ప్రజల కోసం పని చేస్తున్న విధానం కూడా అంతే దూకుడుగా ఉంటోంది.
పనిచెయ్యడం అంటే ఇలా ఉండాలి..
మామూలుగా అయితే.. రాజకీయాల్లో నాయకులు ‘పని చెయ్యడం’ అనేది, సొంత పనుల విషయంలోనే జరుగుతుంది. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల్ని మేపడం కోసమే అధికారం.. అనుకుంటుంటారు.
కానీ, ఇక్కడ పొలిటికల్ పవర్ స్టార్ పవన్ రూటే సెపరేటు. స్వార్జితాన్ని అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక నాయకుడిగా జనసేనాని మిగిలిపోయారు. ఇంకోపక్క, డిప్యూటీ సీఎం హెూదాలో ప్రజల అవసరాలు గుర్తించి అత్యంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు.
గ్రౌండ్ లెవల్లో..
పని చేయడమంటే ఆషామాషీగా కాదు.! రికార్డు స్థాయిలో.! ఔను, జప్ట్ 50 రోజుల్లోనే, 11 వేల కిలోమీటర్ల మేర రాష్ట్రంలో రోడ్లను (సీసీ రోడ్లు) నిర్మించారు. అదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో. కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం, రిపేర్లు, కొత్త రోడ్ల పనులు చేపట్టిన తీరును తెలియజేస్తోంది. తన శాఖ నుంచి జరుగుతున్న రోడ్ల నిర్మాణం విషయంలో.. గ్రౌండ్ లెవల్ నుంచే తనదైన శైలిలో పర్యవేక్షణ చేస్తున్నారు.
స్వాతంత్య్రం తర్వాత మా ఊరికి రోడ్డు..
మా ఊళ్లో రోడ్లు వచ్చాయ్.. స్వాతంత్య్రం తర్వాత గిరిజన గ్రామాల్లో రోడ్లను చూడటం ఇదే ప్రథమం.. అంటే జనం చర్చించుకుంటున్నారు. రోడ్ల విషయమై, ప్రజలే రికార్డుల ప్రస్తావన తెస్తున్నారు. ఇక.. పరిపాలనలో పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. జనసేన కార్యకర్తలుగా మారి పవన్ కళ్యాణ్ అభిమానులైతే, తమ తమ గ్రామాల్లో రికార్డు స్థాయిలో అత్యంత బాధ్యతాయుతంగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. ‘ఒకప్పుడు సినిమా రికార్డుల గురించి మాట్లాడుకునేవాళ్లం.. ఇప్పుడు పొలిటికల్ రికార్డులు.. పరిపాలన రికార్డులు.. అభివృద్ధి రికార్డుల గురించి మాట్లాడుతున్నాం.. అని జనసైనికులు చెబుతున్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తీసుకొస్తానన్న మార్పు ఇదే! ఈ మార్పు మంచిదే అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.