Wednesday, November 6, 2024

Top Story…. ఇది ముంద‌డుగే…

కులగణనకు వేగంగా చర్యలు
సీఎం రేవంత్‌ ప్రత్యేక చొరవ
రాజకీయాలకు అతీతంగా హర్షం
112 బీసీ కులాల్లో ఆనందోత్సాహాలు
దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు
ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్‌
నెరవేర్చేందుకు ఏకసభ్య కమిషన్‌తో కార్యాచరణ
రెండు నెలల్లో నివేదిక

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌)


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బలహీన వర్గాలకు సంబంధించి మరో ముందడుగు పడింది. బీసీల కులగణనకు సంబంధించి ప్రభుత్వం వేగం పెంచింది. రాహుల్‌ గాంధీ ఆకాంక్ష మేరకు బీసీల కులగణన చేపడతామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు తక్షణం ఏకసభ్య కమిషన్‌ నియమిస్తామని ప్రకటించింది. రెండు నెలల్లోనే నివేదిక సమర్పిస్తుందని తేల్చి చెప్పింది. అంతే కాకుండా, వెంటనే ఇంటింటి సర్వే మొదలు పెట్టింది. దీంతో బీసీల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తుండడంతో ఇక తమకు కూడా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజ కీయ రంగాల్లో ప్రాధాన్యం దక్కుతుందని బలహీనవర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అసెంబ్లిd ఎన్నికల సందర్భంగా కాం గ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్‌ను కామారెడ్డి సభలో ప్రకటించింది.

దీంతో స్థానిక సంస్థల్లో 42 శాతం వరకు రిజర్వేషన్లు లభించే అవకాశాలు ఉన్నాయని బీసీలు ఆశిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మెజారిటీ జనాభా బీసీలదే కావడం గమ నార్హం. రాష్ట్రంలో ఏబీసీడీ గ్రూపుల్లో 130 కులాలు ఉన్నా యని అంచనా. వీరంతా తమ సంప్రదాయాలను కొనసా గించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, సామాజి కంగా, ఆర్ధికంగా ఏమాత్రం అభివృద్ధి వీరి దరికి చేరడం లేద న్నది వాస్తవం. ఒకపక్క దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో తక్షణ ఆదే శాలు వెలువడడం తమకు నిజమైన విజయదశమిగా ఆయా వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వాలు సంకల్పించుకుని, నిర్దిష్టంగా తగిన ఆర్ధిక ప్రణాళికలతో ముందుకు వస్తే తప్ప ఆర్ధిక, సామాజిక ప్రగతి సాధించడం అంత తేలిక కాదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఉద్య మాలు పుట్టుకువచ్చాయి.

ఎందరో నాయకులు తమ సర్వ స్వాలను అర్పించారు. కాని, రకరకాల కారణాలతో ఏమాత్రం అడుగు ముందు కు పడలేదని బీసీల్లో తీవ్ర అసంతృప్తి జ్వా లలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యం లో తెలంగాణ సర్కా ర్‌ చొరవ చూపింది. ఏకసభ్య కమిషన్‌ నిర్దిష్ట కాలావధిలో నివేదికను సమర్పించిన అనంతరం రిజర్వేషన్లపై తగు నిర్ణయం తీసుకోను న్నారు. దీంతో బలహీనవర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగినంత ప్రాధాన్యం లభిస్తుం దని, దీంతో సామాజికంగా ఇతోదికంగా ఆయా కులాల వారు అభివృద్ధి సాధించడానికి మార్గం సుగమమవుతుందని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వంతో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని కేంద్రం, ఇతర రాష్ట్రాలు అనుసరించడానికి అవకాశం ఉంటుంది. దీంతో దేశవ్యాప్తంగా వెనుకబాటుకు గురైన వెనుకబడిన తరగతులకు చెందిన వారు రిజర్వేషన్‌ ఫలాలను అందుకుని అభివృద్ధి పథంలో పయనిస్తారని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

బీసీల వెనుకబాటు తనం గురించి 1953లోనే దేశంలో కాలేల్కర్‌ కమిషన్‌ ఏర్పాటైంది. దేశం మొత్తం మీద 2399 వెనుకబడిన కులాలు ఉన్నాయని, అందులో 837 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని కమిషన్‌ 1955లో తన నివే దికను సమర్పించింది. అయితే, కాలేల్కర్‌ కమిషన్‌ నివేదిక సిఫారసులను నాటి కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. ఆ తర్వాత చాలా కాలానికి మండల్‌ కమిషన్‌ 1979లో ఏర్పాటైంది. ఈ కమిషన్‌ 1980 డిసెంబర్‌ 31న రాష్ట్రపతికి సమర్పించింది. దేశ జనాభాలో 52 శాతం బీసీలు ఉన్నారని మండల్‌ కమిషన్‌ నిర్ధారించింది. ఇందుకు సమానంగా రిజర్వేషన్లు ఉండాలని సిఫారసు చేసింది. సమస్య ఇక్కడే మొదలైంది. రిజర్వేషన్లు 50 శాతం దాటరాదన్నది దేశ సర్వోన్నత న్యా యస్థానం ఆదేశం.

- Advertisement -

ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం ఉం డగా, బీసీలకు 27 శాతానికి ప్రభుత్వం పరిమితం చేసింది. దేశంలో హిందూయేతరులను కూడా బీసీలుగా గుర్తించింది. మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తామని ఆనాటి ప్రధాని వీపీ సింగ్‌ పార్లమెంటులో ప్రకటించారు. కాని, దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా రంగాల్లో కచ్చి తంగా బీసీలకు మరింత మెరుగైన అవకాశాలు దక్కాలంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు దక్కాల్సిందేనని మేధావి వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement