2020తో పోలిస్తే 2021లో కార్ల అమ్మకాలు పెరిగినప్పటికీ ఆశించినంత కొనుగోళ్లు జరగలేదు. దీనికి ప్రధాన కారణం సెమీకండక్టర్ కొరత. అయితే కార్ల కోసం కస్టమర్లు తెగ వెతికేశారు. ఎక్కువగా సెర్చ్ చేసిన కార్లలో టాప్-5 స్థానంలో ఉన్న కార్లు ఇవే..
కియా సెల్టోస్..
కియా దక్షిణ కొరియా కార్ల సంస్థకు చెందింది.. అయితే కియా సెల్టోస్ గురుంచి 2021 సంవత్సరంలో గూగుల్ సర్చ్‌లో నెలకు సగటున 8 లక్షల మంది వెతికారు. భారతీయ మార్కెట్లో ఈ కంపెనీ విడుదల చేసిన మొదటి కారు ఇదే. ప్రస్తుతం దేశంలో మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయి. కియా సెల్టోస్ మూడు ఇంజిన్లలో వస్తుంది. కియా సెల్టోస్ ప్రారంభ ధర ₹9.95 లక్షల(ఎక్స్ షోరూమ్)కు విక్రయిస్తున్నారు.
మహీంద్రా థార్..
గూగుల్ సర్చ్‌లో రెండో స్థానంలో ఈ వెహికిల్ ఉండగా.. నెలకు సగటున 6.7 లక్షల మంది మహీంద్రా థార్ రెండో ఎస్యువీ కారు సర్చ్ చేశారు. ఈ మహీంద్రా థార్ ఎస్‌యువీలో రెండు ఇంజిన్ ఆప్షన్ లు ఉన్నాయి. 2.0 లీటర్ ఎమ్ స్టాలియన్ 150 టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్, రెండో ఆప్షన్ 2.2-లీటర్ ఎమ్ హాక్ 130 డీజిల్ ఇంజిన్. మహీంద్రా థార్ బేస్ వేరియంట్ ధర ₹12.78 లక్షల(ఎక్స్ షోరూమ్)తో ప్రారంభమవుతుంది.
టాటా నెక్సన్..
టాటా నెక్సన్ ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన వాటిలో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఈ కారు రెండు ఇంజిన్ లతో వస్తుంది. 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, మరో 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. టాటా నెక్సన్ ₹7.29 లక్షల(ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది.
కియా సోనెట్..
4వ స్థానంలో కియా సోనెట్ నిలిచింది. ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది ప్రారంభంలో సెల్టోస్ కాంపాక్ట్ ఎస్యువీతో పాటు అమ్మకానికి వచ్చింది. ఈ కియా సోనెట్ ప్రారంభ ధర ₹6.89 లక్షలు(ఎక్స్ షోరూమ్).
టాటా పంచ్..
2021లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన కార్లలో కియాకు చెందిన సోనెట్ 5వ స్థానంలో ఉండగా.. టాటా పంచ్ ఇతర టాటా కార్ల కంటే ఎక్కువ బుకింగ్స్ సంపాదించింది. టాటా పంచ్ 1.2 లీటర్ రీవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. టాటా పంచ్ ₹5.48 లక్షల(ఎక్స్ షోరూమ్) ధరకు లభ్యం అవుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital