హైదరాబాద్, ఆంధ్రప్రభ: సుప్రసిద్ధ ప్రాచీన ఆలయాల పరిసరాలను తీర్చిదిద్దేందుకు ప్రసాద్ స్కీం ద్వారా నిధులు కేటాయించాలని కేంద్ర పర్యాటక శాఖకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు డీపీఆర్ లు సమర్పించింది. ఈ డీపీఆర్ లోప్రధానంగాసిద్దిపేట లోని కాకతీయులకాలంనాటి రామలింగేశ్వరాలయం, నిజామాబాద్ లోని ప్రాచీన రామాలయం, బల్కంపేట ఎల్లమ్మ, సుప్రసిద్ధ వేములవాడ ఆలయం, గండిమైసమ్మ ఆలయాలున్నాయి. సిద్దిపేట రామలింగేశ్వరాలయాన్ని క్రీ.శ. 1117 రాక్షసనామసంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజున రాణీ రుద్రమదేవీ శంకుస్థాపన చేసినట్లు శిలాశాసనాధారాలున్నాయి.
అలాగే ఈ ఆలయంలో విశ్వేశ్వరజీ పేరుగల పూజారిని రుద్రమదేవి నియమించి ఆలయంలో నిత్యదీప దూపనైవేద్యానికి భూదానం చేసినట్లుశాసనాధారాలు లభ్యమవుతున్నాయి. కాకతీయుల సామంతరాజు మల్లిరెడ్డి పాలనలో ఈ ఆలయాన్ని అబివృద్ధి చేయగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయల కల్పనతో పాటుగా భక్తుల సౌకర్యంకోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అయితే కేంద్రప్రభత్వ ప్రసాద్ స్కీం ద్వారా పరిసరాల్లో టూరిజం అభివృద్ధి చేసేందుకు రూ. 4కోట్ల 59 లక్షలతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి సమర్పంచింది.
తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని డిచ్ పల్లి రామాలయం పరిసరాల్లో పర్యాటకాభివృద్ధికోసం రాష్ట్ర పర్యాటక శాఖ రూ. 4.96 కోట్ల తో అభివృద్ధి ప్రణాళిక రూపొందించి కేంద్రానికి పంపించింది. డిచ్ పల్లి రామాలయ నిర్మాణాన్ని క్రీ.శ. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడుప్రారంభించగాక్రీ.శ. 1311 పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాకతీయ శిల్పకళకు ఈ ఆలయం ప్రతీకగా నిలిచింది. అయితే కాతీయుల ఆలాయాల్లో తొలిసారిగా ఖజురహో శైలిని పోలిన బంగిమల చిత్రాలు ఈ ఆలయంలో ఉన్నాయి.
ఈ ఆలయ పరిసరాలకోసం రూ. 4కోట్ల 65 లక్షలు, సుప్రసిద్ధ వేముల వాడ పుణ్య క్షేత్ర్రం పరిసరాల్లోని ప్రాచీన ఆలయాలకు పర్యాటక నగిషీలు దిద్దేందుకు రూ. 4కోట్ల 96 లక్షలు, గండిమైసమ్మ ఆలయాభివృద్ధికి రూ. 4కోట్ల 66 లక్షలు, బల్కం పేట ఎల్లమ్మ ఆలయం భక్తుల సౌకర్యాల పెంపుకు రూ. 4.66 కోట్ల తో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ డీపీఆర్ లను కేంద్ర పర్యాటక శాఖకు సంమర్పించింది. అయితే ఈ నివేదకలపై కేంద్ర పర్యాటక శాఖ స్పందించకపోవడంతో ప్రస్తుతంరాష్ట్ర ప్రభుత్వ నిధులతో పర్యాటకాభివృద్ధి శాఖన పనులు ప్రారంభించింది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా టెంపుల్ టూరిజానికి ఇస్తున్న ప్రాదాన్యతలో భాగంగా కేంద్రానికి నివేదికలు సమర్పించినా స్పందన లేదని అధికారులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుప్రసిద్ధ ప్రాచీన ఆలయాలు వందల్లో ఉన్నాయనీ వాటిని పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. శాతవాహనుల నుంచి విష్ణుకుండినిలు, చాళుక్యులు, కాకతీయ రాజులు నిర్మించిన ఆలయాల మరమ్మతుకు సమగ్ర ప్రణాళికలను రూపొందించి అమలు చేసేందుకు పర్యాటక శాఖ చేస్తున్న కృషి ఫలిస్తే పర్యాటకరంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది.