Friday, November 22, 2024

TS | మావోయిస్టు అగ్ర‌నేత దీప‌క్‌రావు అరెస్టు.. నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ అన్న డీజీపీ అంజ‌నీకుమార్‌

సీపీఐ మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్‌ దీపక్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ విష‌యాన్ని డీజీపీ అంజనీ కుమార్ ఇవ్వాల (శుక్రవారం) మీడియాకు వెల్లడించారు. దీపకర్‌రావు పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారని, పలువురు అగ్రనేతలతో దీపక్‌రావు సమావేశాలు జరిపారని డీజీపీ పేర్కొన్నారు. కర్నాటక, తమిళనాడు, కేరళ ట్రైజంక్షన్‌ ఏరియాలో దీపక్‌రావు కీలకంగా ప‌నిచేశార‌ని డీజీపీ అంజ‌నీకుమార్ చెప్పారు.

దీపక్‌రావు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, రెండు మూడు రోజుల కిందట హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ట్టు డీజీపీ వెళ్ల‌డించారు. ఆయన కోసం మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటక పోలీసులు గాలిస్తున్నారని, అలాగే ఎన్‌ఐఏ బృందాలు కూడా వెతుకుతున్నాయని తెలిపారు. దీపక్‌రావుపై మహారాష్ట్ర రూ.25లక్షల రివార్డ్‌ను ప్రకటించిందన్నారు.

ఇదిలా ఉండగా కేరళలో దీపక్‌రావును అనిల్‌, వికాస్‌ పేర్లతో పిలుస్తుంటారు. మహారాష్ట్ర థానే జిల్లా అంబర్‌నాథ్‌కు చెందిన దీపక్‌రావు గతంలో రెండుసార్లు అరెస్టయ్యారు. ధూలే, బెంగళూరులోనూ అరెస్టయి జైలుకు వెళ్లివచ్చారు. చాలాకాలం మహారాష్ట్రలో పనిచేసిన ఆయన 2019లో పాలకాడ్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత మణివాసగం మృతి తర్వాత 2020 నుంచి పశ్చిమ ఘాట్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement