బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా బండి సంజయ్ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పార్టీ జాతీయ నేతలతోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు బండి సంజయ్ కు ఫోన్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బండి తరపున పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement