Friday, January 10, 2025

W – IND vs IRE | సమరోత్సాహంతో భారత్‌.. రేపు ఐర్లాండ్‌తో తొలి వన్డే !

భారత్‌-ఐర్లాండ్‌ మహిళా జట్ల మధ్య రేప‌టి నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా… ఇప్పుడు అదే దూకుడు పసికూన ఐర్లాండ్‌పై కూడా కొనసాగించాలని చూస్తోంది.

అయితే, ఈసారి రెగ్యూలర్‌ సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో ఆమె స్థానంలో డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ వైస్‌ కెప్టెన్‌గా బాద్యతలు చేపట్టనుంది. హర్మన్‌తో పాటు స్టార్‌ పేసర్‌ రేణుకా సింగ్‌కు కూడా మేనేజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది.

వెస్టిండీస్‌ సిరీస్‌తో అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించిన ప్రతీక రావల్‌, తనూజ కన్వర్‌ ఐర్లాండ్‌ సిరీస్‌కు కూడా ఎంపికయ్యారు. మరోవైపు విండీస్‌ సిరీస్‌లో ఎంపికైన సయాలీ సత్‌ఘరే.. తుది జట్టులో మాత్రం చోటు సాధించలేక పోయింది.

కాగా, ప్రస్తుతం టీమిండియా మ‌హిళ‌ల‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. కెప్టెన్‌ మంధానతో పాటు ప్రతీక రావల్‌, హర్లీన్‌ డియోల్‌, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్‌, దీప్తి శర్మ తదితరులు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. ఎలాంటి బౌలింగ్‌ లైనప్‌నైనా ఈజీగా ఎదుర్కోగలరు.

ఇక బౌలింగ్‌లోనూ టిటాస్‌ సాధు, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ, ప్రతీక రావల్‌, తనూజా కన్వర్‌, తదితరులతో టీమిండియా పటిష్టంగా ఉంది. అందరూ కలిసి కట్టుగా రాణిస్తే టీమిండియాకు మరో సిరీస్‌ దక్కడం ఖాయం.

- Advertisement -

జట్ల వివరాలు:

భారత్‌: స్మృతి మంధాన (కెప్టెన్‌), దీప్తి శర్మ (వైస్‌ కెప్టెన్‌), ప్రతీక రావల్‌, హర్లీన్‌ డియోల్‌, జెమీమా రోడ్రిగ్స్‌, ఉమా ఛెత్రి, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), తేజల్‌ హసబ్‌నిస్‌, రాఘ్వీ బిస్త్‌, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్‌, టిటాస్‌ సాధు, సైమా ఠాకూర్‌, సయాలీ సత్‌ఘరే.

ఐర్లాండ్‌: గాబీ లూయిస్‌ (కెప్టెన్‌), అవా కానింగ్‌, క్రిస్టినా కౌల్టర్‌ రీల్లే, అలానా డాల్జెల్‌, జార్జినా డెంప్సే, సారా ఫోర్బ్స్‌, జొన్నా లాగ్హరన్‌, ఎమీ మగైరె, లీహ్‌ పాల్‌, ఓర్లా ప్రెండరెగస్ట్‌, ఉనా రేమండ్‌, ఫ్రెయా సర్గెట్‌, రెబెక్కా స్టాకెల్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement