దీపావళి పండగకు స్టాక్‌మార్కెట్‌లో ప్రత్యేక సందడి ఉంటుంది. పండగ రోజు లక్ష్మీ పూజతో పాటు, ముహూరత్ ట్రేడింగ్ ప్రత్యేక ఆకర్ణణగా నిలుస్తుంది. దీపావళి నాడు గంట సేపు ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. ప్రతిసారి సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల వరకు దీన్ని నిర్వహిస్తారు. ముహూరత్ ట్రేడింగ్‌ను ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు. ప్రపంచంలో మరే దేశంలోని స్టాక్‌మార్కెట్లు ఈతరహా ట్రేడింగ్ నిర్వహించడంలేదు. ఒక్క మన దేశంలోనే దీపావళి పర్వదినం రోజు నాడు దీన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇది ముగిసిన తరువాత సంపత్ 2079 సాంప్రదాయంగా ప్రారంభించారు.
ఎప్పుడు ప్రారంభమైంది
స్టాక్‌మార్కెట్‌లో ముహూరత్ ట్రేడింగ్‌ను 1957లో ముందుగా బొంబే స్టాక్‌ఎక్స్‌ంజ్‌లో ప్రారంభించారు. 1992లో దీన్ని ఎన్‌ఎస్‌సీ నిఫ్టీలో కూడా ప్రారంభించారు. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తం. ఈ సందర్భాన్ని వ్యాపారులు, ఇన్వెస్టర్లు శుభదినంగా భావిస్తారు.
సాధారణంగా దేశంలోని వ్యాపారులు, వ్యాపార సంఘాలు, షాపులు, షోరూమ్‌లు కొత్త ఖాతాలను తెరవడంతో పాటు, ఆ రోజున క్రితం బ్యాలెన్స్ షీట్‌ను మూసివేస్తారు. ఈ రోజున ట్రేడ్ ప్రముఖులు, అనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను తమ కస్టమర్లకు రికమండ్ చేస్తుంటారు. ఈ సారి దీపావళి రో జులైన 24వ తేదీన ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. సాధారణంగా ముహూరత్ ట్రేడింగ్‌లో ఎక్కువ షేర్లు లాభాల్లోనే ముగుస్తాయి.