శ్రీలంకతో చివరిదైన మూడో వన్డే కోసం భారత జట్టు తిరువనంతపురం చేరుకుంది. కథాకళి నృత్యకారులతో పాటు కొందరు కేరళ సాంప్రదాయ వేషధారణలో డోలు వాయిస్తూ టీమిండియాకు ఘన స్వాగతం చెప్పారు. జనవరి 15న గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. రెండు విజయాలతో భారత్ సిరీస్‌ను గెలుచుకుంది. తొలి వన్డేలో 67 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో మూడో వన్డే నామమాత్రమైంది.
మూడో వన్డేలో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే కనీసం ఆఖరివన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు కొంతమంది శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. కాగా టీ 20 ఫార్మట్‌లో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. తాజాగా లంకతో జరిగిన టీ 20 సిరీస్‌తో పాటు ఈ నెల 18 నుంచి కివీస్‌తో జరగబోయే టీ 20 సిరీస్‌ల నుంచి ఈ ఇద్దరిని పక్కన పెట్టారు. వీళ్లను టెస్ట్, వన్డే టెస్ట్ జట్లకు పరిమితం చేసే ఉద్దేశ్యంలో సె లెక్టర్లు ఉన్నారు.