ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాల కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై విజయంతో పట్టికలో ఇంగ్లాండ్ ఏడో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో విఫలమైన ఇంగ్లాండ్ జట్టు 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది. ఇక ప్రపంచకప్‌లోని లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ రేపు బెంగళూరు వేదికగా భారత్‌తో నెదర్లాండ్స్ తలపడనుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ విజయం సాధించినప్పటికీ ఇంగ్లాండ్ స్థానానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు.
ఇక ఈ మ్యాచ్ తరువాత సెమీస్ పోరు ప్రారంభం కానుంది. సెమీస్‌లో… పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో ఉన్న జట్టు న్యూజిలాండ్ తో పోటీపడాల్సి ఉంది. అంటే భారత్ – కివీస్‌ల మధ్య మ్యాచ్ ఈనెల 15న ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియం వేదికగా తొలి సెమీస్ జరగాల్సి ఉంది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీస్ జరుగనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజేతలు నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌లో తలపడతాయి.