వన్డే ప్రపంచకప్ ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగనుంది. మొహాలీ వేదికగా ఇరు జట్ల మధ్య రేపు (శుక్రవారం) తొలి వన్డే ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే తొలి వన్డేకు ముందు ఆసీస్ కు భారీ షాక్ తగిలింది. సౌతాఫ్రికా పర్యటనలో ట్రావిస్ హెడ్ చేతికి ఫ్రాక్చర్ అవ్వడంతో అతడు ఈ సిరీస్ కు దూరమయ్యాడు.
ఇక తాజాగా తొలి వన్డే నుంచి గాయాల కారణంగా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్, పేసర్ మిచెల్ స్టార్క్ కూడా దూరమయ్యారు. ఇక గాయాల కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్ లు తొలి వన్డేలో ఆడనున్నారు. వీరిద్దరు పూర్తి ఫిట్ నెస్ సాధించడంతో తొలి వన్డేలో బరిలోకి దిగనున్నారు.
భారత్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించగా, మూడో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పునరాగమనం చేయనున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లితో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లకు కూడా విశ్రాంతి కల్పించారు. రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టులోకి తిరిగి రావడం విశేషం.
తొలి 2 వన్డేలకు టీం ఇండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, తిలక్ వర్మ, ప్రసీద్ రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
మూడో వన్డేకి టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ., అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
తొలి వన్డే మొహాలీ వేదికగా జరగనుండగా.. రెండో వన్డే ఇండోర్ వేదికగా 24న.. మూడో వన్డే 27న రాజ్ కోట్ వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్ వార్మప్ మ్యాచ్ లకు రెడీ అవుతుంది.