విశాఖ ఎడ్యుకేషన్, (ప్రభన్యూస్): ఏపీఎస్సిహెచ్ఇ, ఆంధ్రవిశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏపీఎడ్సెట్ 2023 ప్రవేశ పరీక్ష ఈనెల 14 నిర్వహించనున్నట్లు ఎడ్సెట్ 2023 కన్వీనర్ ఆచార్య కె. రాజేంద్రప్రసాద్ తెలిపారు. బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివేందుకు ఈ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు క్వాలిఫైడ్ ర్యాంక్ ప్రకారం అడ్మిషన్స్ కల్పిస్తారన్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే ఈపరీక్షకు 36 నగరాల్లో 77 పరీ క్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష రేసేందుకు 13,672 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఉదయం 7.30 గంటలకే పరీక్షా హాల్కి అనుమతి లభిస్తుందన్నారు. ఐడి ఫ్రూప్తో పాటు ఫ్రింటెడ్ అప్లికేషన్ హాల్ టికెట్ తో పరీక్షా హాల్కి హాజరవ్యాలన్నారు.
Followup | రేపు ఏపీ ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష. 36 నగరాల్లో 77 పరీక్ష కేంద్రాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement