వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌స్ర్టుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంకులకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సోమవారం ఈ-గజిట్ జారీ చేశారు. వాస్తవానికి వినాయక చవితి సందర్భంగా 31న సెలవు ప్రకటించాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఆగస్టు 4నే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అయితే పండుగ దగ్గరపడుతున్నా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు సెలవుపై గందరగోళానికి గురయ్యారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ప్రభుత్వం సోమవారం హడావుడిగా గజిట్‌ను విడుదల చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement