Friday, November 22, 2024

మహిషాసురమర్దని దేవిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న అమ్మ‌వారు..

అయిగిరినందిని, నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్య శిరోధినివాసిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటు-ంబిని, భూరికుటు-ంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||

శరన్నవరాత్రి మహోత్సవములలో ఆశ్వయుజ శుద్ద నవమి రోజున కనకదుర్గమ్మవారు మహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మవారి సహజ స్వరూపం ఇదే. మహిషాసురమర్థినీదేవి అలంకారములో ఉన్న అమ్మవారిని దర్శించడంవలన అరిషడ్వర్గాలు నశిస్తాయి, సాత్వికభావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య, శౌర్య, విజయాలు చేకూరుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement