సమ్మర్ అనేది సినిమాలకు మంచి సీజన్. మార్చి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు సమ్మర్ సీజన్‌గా సినీ వర్గాలు పేర్కొంటాయి. ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి తర్వాత ఎక్కువ సినిమాలు విడుదలయ్యేది సమ్మర్ లోనే. కానీ గడచిన ఏడాది సమ్మర్ సినీ రంగానికి మిస్సయింది. కోవిడ్ కారణంగా వచ్చిన లాక్ డౌన్, ఆ తర్వాత నిబంధనల వల్ల చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాదిలో సమ్మర్ సీజన్ సినీరంగానికి అనుకూలం గా ఉండవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. జనవరి నెలాఖరు నుండి కరోనా మూడవ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు నైట్ కర్య్ఫూ కూడా విధించాయి. థియేటర్ల ఆక్యూపెన్సీ సగమే ఉండాలని ఆదేశించాయి. ఈ కారణంగా జనవరి నెలాఖరు నుండి సినిమాల విడుదల తగ్గింది. అయితే ఫిబ్రవరి వరకు సాధారణ పరిస్థితులు నెలకోంటాయని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈ కారణం చేత ఫిబ్రవరి ఒకటవ తేదీన రావాల్సిన చిరంజీవి నటించిన ఆచార్య వాయిదా పడింది. ఏప్రిల్ ఒకటవ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన పవన్ కల్యాణ్ భీవ్లూనాయక్ పై స్పష్టత రావాల్సి ఉంది. నిబంధనలు సడలిస్తే ప్రకటించిన ప్రకారమే విడుదల చేస్తారు. లేదా వాయిదా వేస్తారు. మార్చి విషయానికి వస్తే జనవరి 7న రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడింది. ఈ సినిమా కొత్త తేదీలను చిత్ర బృందం తెలిపింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని కొత్త తేదీలను రిజర్వు చేసుకున్నారు.
ఇప్పటికే మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో విడుదల తేదీ ప్రకటించిన సినిమాలు ఉన్నాయి. వీటి గురించి ఏ మాత్రం ఆలోచిం చకుండా ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ ఏకపక్షంగా రిలీజ్ తేదీలు ప్రకటించారని కొందరు నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీల వల్ల ఇప్పటికే నాల్నుగు సార్లు గందరగోళం నెలకొంది. పాన్ ఇండియా సినిమా, పైగా క్రేజీ సినిమా అనే ఒకే ఒక కారణంతో విడుదల తేదీలను ప్రకటిస్తోందని నిర్మాతలు వాపోతున్నారు. మార్చి ఏప్రిల్ నెలల్లో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, గోపిచంద్ పక్కా కమర్షి యల్, వరుణ్ తేజ్ గని, వెంకటేశ్ ఎఫ్ 3, పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఇదంతా ఇప్పటి వరకు ఉన్న ప్లానింగ్ కానీ, ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీలను అనుసరించి విడుదల తేదీల్లో మార్పుకు అవకాశం ఉంది.
ఇక ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ సైతం సంక్రాంతి బరినుండి తప్పుకున్న విషయం తెలిసిందే. రాధేశ్యామ్ సైతం మార్చిలో వచ్చేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ సినిమా రెండు తేదీలను ప్రకటించింది కాబట్టి, వాటిని అనుసరించి మరో కొత్త తేదీ కోసం రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. సమ్మర్ సీజన్ సినిమాలకు అనుకూలంగా ఉంటుందనే సినీ వర్గాలు భావిస్తున్నాయి. అదికూడా కోవిడ్ ప్రభావం తగ్గితే, థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటేనే సాధ్యమవుతుంది. లేదంటే పరిస్థితి మళ్లి మొదటికే వస్తుంది. అలాంటి పరిణామాలు ఎదురైతే మాత్రం చాలా సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకువస్తాయని భావించవచ్చు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..