2017లో టాలీవుడ్‌లో సెన్సేషల్ క్రియేట్ చేసిన డ్రగ్స్ వ్యవహారం.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో సుమారు 12 మందికి ఈడీ సమన్లు జారీ చేసింది. పూరీ జగన్నాథ్, రానా, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్‌లను ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ వ్యవహారంలోని మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎవరెవరిని ఎప్పుడు విచారిస్తుందంటే..ఆగస్టు 31 – పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2 – ఛార్మి, సెప్టెంబర్ 6 – రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8 – రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9 – రవితేజ, సెప్టెంబర్ 9 – శ్రీనివాస్ (రవితేజ డ్రైవర్), సెప్టెంబర్ 13 – నవదీప్, సెప్టెంబర్ 13 – ఎఫ్ క్లబ్ జీఎం, సెప్టెంబర్ 15 – ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17 – తనీష్, సెప్టెంబర్ 20 – నందు, సెప్టెంబర్ 22 – తరుణ్
ఈ వార్త కూడా చదవండి: వాటర్ బాటిల్ ఖరీదు రూ.3వేలు.. ప్లేట్ రైస్ ఖరీదు రూ.7,500