Tuesday, November 26, 2024

తన ‘బర్త్ డే’ను ‘డెత్ డే’ అంటూ పోస్ట్ చేసిన RGV

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. ఎలా పడితే అలా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆర్జీవీలో ఉన్న ప్రత్యేకత. అందుకే ఆయనతో ఎవరూ వివాదాలకు వెళ్లాలని కోరుకోరు. ఈరోజు (ఏప్రిల్ 6) ఆర్జీవీ బర్త్‌డే కావడంతో ఆయనకు చాలామంది సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అయితే వర్మకు బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టముండదు. ఇవాళ బర్త్ డే సందర్భంగా ఆర్జీవీకి చాలామంది బర్త్ డే విషెస్ చెబుతున్నారు. దీంతో వారికి ‘నో థ్యాంక్స్’ అని ఆర్జీవీ చెబుతున్నాడు. ‘లేదు, ఈ రోజు నా పుట్టినరోజు కాదు, కానీ ఈ రోజు నా మరణ దినం. ఎందుకంటే నా జీవితంలో మరో సంవత్సరం ఈ రోజు మరణించింది’ అని వర్మ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement